యోబు 22:1-5
1
అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు:
2
“ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా? ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా?
3
నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి? నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి?
4
“నీకున్న భయభక్తులను బట్టి ఆయన నిన్ను గద్దిస్తారా? దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తారా?
5
నీ దుష్టత్వం గొప్పది కాదా? నీ పాపాలు అంతులేనివి కావా?
Settings