యిర్మీయా 33:14-22
14
“యెహోవా అంటూ ఇలా ప్రకటిస్తున్నారు, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చే రోజులు వస్తున్నాయి.’
15
“ ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు వంశం నుండి నీతి కొమ్మను మొలకెత్తిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు.
16
ఆ రోజుల్లో యూదాకు కాపుదల ఉంటుంది యెరూషలేము క్షేమంగా జీవిస్తుంది. యెహోవాయే మన నీతిమంతుడైన రక్షకుడు అనే పేరుతో యెరూషలేము పిలువబడుతుంది.’
17
యెహోవా ఇలా అంటున్నారు: ‘ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చోడానికి దావీదుకు ఒకడు లేకుండా ఉండడు.
18
నా ఎదుట నిలబడి దహనబలులు అర్పించడానికి, భోజనార్పణలు అర్పించడానికి, బలులు అర్పించడానికి లేవీయులైన యాజకులకు ఒకడు లేకుండా పోడు.’ ”
19
యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి:
20
“యెహోవా ఇలా అంటున్నారు: ‘పగలు రాత్రులు వాటి నిర్ణీత సమయంలో రాకుండా నేను పగటికి, రాత్రికి చేసిన నా ఒడంబడికను మీరు భంగం చేస్తే,
21
అప్పుడు నా సేవకుడైన దావీదుతో తన సింహాసనంపై రాజ్యం చేయడానికి అతనికి ఒకడు లేకుండా పోడని నేను చేసిన నిబంధన, నా ఎదుట పరిచర్య చేస్తున్న యాజకులుగా ఉన్న లేవీయులతో నేను చేసిన నిబంధన వ్యర్ధం అవుతుంది.
22
నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నా ఎదుట పరిచర్య చేసే లేవీయులను ఆకాశంలోని నక్షత్రాలవలె లెక్కపెట్టలేనంతగా, సముద్రతీరంలోని ఇసుకలా కొలువలేనంతగా చేస్తాను.’ ”
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.