2 రాజులు 15:1-11
1
ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలన యొక్క ఇరవై ఏడవ సంవత్సరంలో, యూదారాజు అమజ్యా కుమారుడైన అజర్యా పరిపాలన ఆరంభించాడు.
2
అతడు రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా; ఆమె యెరూషలేముకు చెందినది.
3
అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
4
అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
5
యెహోవా రాజును కుష్ఠరోగంతో బాధించారు, అది అతడు చనిపోయే దినం వరకు ఉంది. అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. రాజకుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.
6
అజర్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
7
అజర్యా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.
8
యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో, యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలుకు సమరయలో రాజయ్యాడు, అతడు ఆరు నెలలు పరిపాలించాడు.
9
అతడు తన పూర్వికులు చేసినట్లు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
10
యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యా మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని తర్వాత రాజయ్యాడు.
11
జెకర్యా గురించిన ఇతర విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings