2 దినవృత్తాంతములు 25:23-28
23
ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు అతన్ని యెరూషలేముకు తెచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు పడగొట్టాడు.
24
అతడు దేవుని మందిరంలో ఓబేద్-ఎదోము సంరక్షణలో ఉన్న కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని, రాజభవన ఖజానాను బందీలను తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు.
25
యెహోయాహాజు కుమారుడు, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు మృతి తర్వాత, యూదారాజు, యోవాషు కుమారుడైన అమజ్యా ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు.
26
అమజ్యా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు మొదటి నుండి చివరి వరకు, యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడలేదా?
27
అమజ్యా యెహోవాను వెంబడించడం మానివేసిన సమయం నుండి ప్రజలు యెరూషలేములో కొందరు అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషుకు పారిపోయాడు, కాని వారు అతని వెంట లాకీషుకు మనుష్యులను పంపి అతన్ని అక్కడ చంపారు.
28
అప్పుడు వారు గుర్రం మీద అతని శవాన్ని తెప్పించి, యూదా పట్టణంలో అతని పూర్వికుల దగ్గర పాతిపెట్టారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings