Skip to content
1 థెస్సలొనీకయులకు 5:23-28

1 థెస్సలొనీకయులకు 5:23-28

23
సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.
24
మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు.
25
సహోదరీ సహోదరులారా, మాకోసం ప్రార్థించండి.
26
దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు.
27
సహోదరీ సహోదరులందరికి ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆదేశిస్తున్నాను.
28
మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీతో ఉండును గాక.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options