కంటెంట్‌కు వెళ్లండి
1 సమూయేలు 9:18-24

సౌలు సమూయేలును కలుసుట

1 సమూయేలు 9:18-24
18
సౌలు గుమ్మం దగ్గర సమూయేలును కలుసుకొని, “దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడో దయచేసి నాకు చెప్పరా?” అని అడిగాడు.
19
అందుకు సమూయేలు సౌలుతో, “నేనే దీర్ఘదర్శిని, ఉన్నత స్థలానికి నా కంటే ముందు వెళ్లండి, ఈ రోజు మీరు నాతో భోజనం చేయాలి. ఉదయాన నీ హృదయంలో ఉన్నదంతా నీకు చెప్పి నిన్ను పంపిస్తాను.
20
మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదల గురించి బాధపడకు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయులు కోరుకుంటుంది నిన్ను నీ కుటుంబమంతటిని గాక, ఇంకెవరిని?” అన్నాడు.
21
అందుకు సౌలు, “నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల్లోని చిన్న గోత్రం కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు వంశాలన్నిటిలో నా వంశం చిన్నది కాదా? నాతో ఇలా ఎందుకు అంటున్నారు?” అన్నాడు.
22
అప్పుడు సమూయేలు సౌలును అతని సేవకుడిని భోజనశాలలోనికి తీసుకెళ్లి, ప్రత్యేకంగా పిలువబడ్డ సుమారు ముప్పైమంది ఉన్న ప్రధాన స్థలంలో వారిని కూర్చోబెట్టాడు.
23
సమూయేలు వంటమనిషితో, “నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన మాంసపు భాగాన్ని తీసుకురా” అని చెప్పాడు.
24
వంటమనిషి మాంసంతో ఉన్న తొడను తెచ్చి సౌలు ముందు పెట్టాడు. అప్పుడు సమూయేలు సౌలుతో, “ఇదిగో నీకోసం దాచిపెట్టింది, ఇది తిను ఎందుకంటే ‘నేను అతిథులను ఆహ్వానించాను’ అని వంటమనిషితో చెప్పి దీన్ని నీ కోసం తీసి ఉంచమన్నాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options