1 రాజులు 22:41-47
41
ఇశ్రాయేలు రాజైన అహాబు పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు యూదాకు రాజయ్యాడు.
42
యెహోషాపాతు యూదాకు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె.
43
ప్రతీ విషయంలో అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
44
అంతేకాక యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి కలిగి ఉన్నాడు.
45
యెహోషాపాతు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విజయాలు, యుద్ధం విన్యాసాలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
46
అతడు తన తండ్రి ఆసా పాలన తర్వాత కూడా అక్కడ మిగిలిపోయిన ఆలయాలలో ఉన్న పురుష వేశ్యలను దేశంలో నుండి తొలగించాడు.
47
ఆ రోజుల్లో ఎదోము దేశానికి రాజు లేడు; ఒక ప్రాంతీయ అధికారి పరిపాలించేవాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings