Skip to content
1 రాజులు 20:13-22

1 రాజులు 20:13-22

13
ఈలోగా, ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ఈ గొప్ప సైన్యాన్ని చూస్తున్నావా? దానిని ఈ రోజు నీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు యెహోవాను నేనని నీవు తెలుసుకుంటావు’ ” అని ప్రకటించాడు.
14
“కాని ఇది ఎవరు చేస్తారు?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు చేస్తారు.’ ” “ఎవరు యుద్ధం ఆరంభిస్తారు?” అని అహాబు అడిగాడు. “నీవే” అని ప్రవక్త జవాబిచ్చాడు.
15
కాబట్టి అహాబు ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే 232 యువ అధికారులను పిలిపించాడు. తర్వాత అతడు మిగితా ఇశ్రాయేలీయులను, మొత్తం 7,000 మందిని సమకూర్చాడు.
16
మధ్యాహ్నం వారు బయలుదేరి వెళ్లారు, అప్పుడు బెన్-హదదు, అతనికి అండగా వచ్చిన ఆ ముప్పై రెండు మంది రాజులు గుడారాల్లో త్రాగుతూ మత్తులో ఉన్నారు.
17
ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు మొదట బయటకు వెళ్లారు. బెన్-హదదు కొందరు సైనికులను పంపించినప్పుడు వారు, “సమరయ నుండి మనుష్యులు ఎదురుగా వస్తున్నారు” అని చెప్పారు.
18
అందుకతడు అన్నాడు, “వారు సమాధానం కోరి వస్తే ప్రాణాలతో వారిని పట్టుకోండి; వారు యుద్ధానికి వస్తే, ప్రాణాలతో వారిని పట్టుకోండి.”
19
ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు, పట్టణం బయటకు వెళ్లారు, సైన్యం వారి వెనుక వెళ్లింది.
20
ప్రతి ఒకడు తన ప్రత్యర్థిని కూలగొట్టాడు. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు తరుముతూ ఉంటే, అరామీయులు పారిపోయారు. అరాము రాజైన బెన్-హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతో పాటు తప్పించుకున్నాడు.
21
అప్పుడు ఇశ్రాయేలు రాజు నగరం నుండి వెళ్లి గుర్రాలను, రథాలను స్వాధీనం చేసుకుని, అరామీయులను చాలామందిని హతం చేశాడు.
22
తర్వాత ఇశ్రాయేలు రాజు దగ్గరకు ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, “ధైర్యం తెచ్చుకుని నీవు ఏం చేయాలో నిర్ణయించుకో, ఎందుకంటే, వచ్చే వసంతకాలంలో అరాము రాజు మళ్ళీ నీ మీద దాడి చేస్తాడు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options