Skip to content
1 కొరింథీయులకు 12:22-31

1 కొరింథీయులకు 12:22-31

22
అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి,
23
ఏ భాగాలు ఘనతలేనివని మనం భావిస్తామో వాటికి మనం అధిక ఘనతను ఇస్తాము. అందంగా లేని శరీరభాగాలు ప్రత్యేకమైన శ్రద్ధను పొందగా,
24
అందంగా ఉన్న శరీర అవయవాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకపోవచ్చును. గౌరవం లేని అవయవాలకు అధిక గౌరవం కలుగడానికి దేవుడే మన శరీరాన్ని ఒక్కటిగా చేశారు.
25
అందువల్ల శరీరంలో విభేదాలు లేవు. అయితే దానిలోని అవయవాలన్ని పరస్పరం ఒకదానిపై ఒకటి సమానమైన శ్రద్ధను కలిగి ఉండడానికి ఆయన అలా చేశారు.
26
ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి.
27
కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే.
28
దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు.
29
అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతాలు చేయగలరా?
30
అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా?
31
కాబట్టి శ్రేష్ఠమైన కృపావరాలను ఆసక్తితో కోరుకోండి. ఇదే కాకుండా, అన్నిటికంటే శ్రేష్ఠమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options