Skip to content
1 దినవృత్తాంతములు 21:1-7

1 దినవృత్తాంతములు 21:1-7

1
సాతాను ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచి, వారి జనాభా లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.
2
కాబట్టి దావీదు యోవాబుతో, సైన్యాధిపతులతో, “మీరు వెళ్లి బెయేర్షేబ నుండి దాను వరకు ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కించండి. వారి సంఖ్య నాకు తెలిసేలా ఆ వివరాలు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
3
కాని యోవాబు రాజుతో, “యెహోవా తన సైన్యాన్ని వందరెట్లు పెంచు గాక! నా ప్రభువా, రాజా, వారంతా నా ప్రభువుకు సేవకులే కదా? నా ప్రభువు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? అతడు ఇశ్రాయేలు మీదికి దోషం ఎందుకు తేవాలి?” అని అన్నాడు.
4
అయితే రాజు యోవాబుపై తన మాట సాధించుకున్నాడు; కాబట్టి యోవాబు వెళ్లి, ఇశ్రాయేలు దేశమంతా తిరిగి యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
5
యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు అంతటిలో కత్తి తిప్పగలవారు పదకొండు లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో నాలుగు లక్షల డెబ్బైవేలమంది ఉన్నారు.
6
రాజాజ్ఞ యోవాబుకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి అతడు లేవీ బెన్యామీను వారిని లెక్కలలో చేర్చలేదు.
7
ఈ ఆజ్ఞ దేవుని దృష్టిలో కూడా చెడ్డగా ఉంది; కాబట్టి ఆయన ఇశ్రాయేలును శిక్షించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options