Zeal గురించి బైబిల్ వచనాలు: Josiah
Josiah గురించి వచనాలు
అతడు బేతేలులో ఎలా చేశాడో అలాగే, ఇశ్రాయేలు రాజులు సమరయ పట్టణాల్లో కట్టి యెహోవాకు కోపం రేపిన ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాలన్నిటినీ యోషీయా తీసివేశాడు.
యోషీయా ఆ క్షేత్రాల పూజారులందరినీ బలిపీఠాల మీద వధించాడు, మనుష్యుల ఎముకలను వాటి మీద కాల్చివేశాడు. తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
రాజు ప్రజలందరికి, “నిబంధన గ్రంథంలో వ్రాయబడినట్టు, మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
అలాంటి పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలను న్యాయం తీర్చిన న్యాయాధిపతుల కాలం నుండి ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు పరిపాలించిన కాలం వరకు ఎన్నడూ ఆచరించలేదు.
అయితే యోషీయా రాజు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో యెరూషలేములో ఈ పస్కా పండుగ యెహోవాకు జరిగింది.
అంతేకాక యోషీయా కర్ణపిశాచులను, ఆత్మలతో మాట్లాడేవారిని, గృహదేవతలు, విగ్రహాలు, యూదాలో యెరూషలేములో కనిపించే ఇతర అసహ్యకరమైన వస్తువులన్నిటిని తీసివేసి యాజకుడైన హిల్కీయాకు యెహోవా మందిరంలో దొరికిన గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడానికి అతడు ఇలా చేశాడు.
అతడు పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించాడు. అతనికంటే ముందు కాని అతని తర్వాత కాని, అతనిలాంటి రాజు ఎవరూ లేరు.