Skip to content

Watchman గురించి బైబిల్ వచనాలు

19 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. యెజ్రెయేలు గోపురం మీద నిలుచున్న కావలివాడు యెహు, అతని సైనికుల గుంపు రావడం చూసి, “నాకు సైనికులు కొంతమంది వస్తున్నట్లు కనిపిస్తుంది” అని బిగ్గరగా అరిచాడు. అందుకు యెహోరాము, “ఒక రౌతును పిలిపించి, వారిని కలవడానికి పంపించు, అతడు వారితో, ‘సమాధానంగా వస్తున్నారా?’ అని అడుగు” అని ఆదేశించాడు.

  2. ఇంకొక మూడవ భాగం సూరు ద్వారం దగ్గర, మరో మూడవ భాగం కాపలాకు వెనుక ఉన్న ద్వారం దగ్గర ఉండాలి.

  3. మీలో సబ్బాతు దినాన్న పనిలో లేనివారు యెహోవా మందిరాన్ని, రాజును కాపలా కాయాలి.

  4. యూదా మనుష్యులు ఎడారి వైపున ఉన్న ప్రదేశానికి వచ్చి విస్తారమైన సైన్యం వైపు చూసినప్పుడు, వారికి నేలమీద పడి ఉన్న మృతదేహాలు మాత్రమే కనిపించాయి; ఎవరూ తప్పించుకోలేదు.

  5. వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు, వారు తివాసీలు పరిచారు, వారు తిని త్రాగుతారు! అధిపతులారా! లేవండి డాళ్లకు నూనె రాయండి.

  6. ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “వెళ్లి కాపలా పెట్టండి అతడు చూసింది తెలియజేయాలి.

  7. అతడు రథాలను గుర్రాల జట్లను గాడిదల మీద వచ్చేవారిని ఒంటెల మీద వచ్చేవారిని చూడగానే అతడు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి.”

  8. కావలివాడు సింహంలా కేకలు వేసి “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.

  9. చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నీ నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”

  10. నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా! సైన్యాల యెహోవా నుండి ఇశ్రాయేలు దేవుని నుండి నేను విన్నది నీకు చెప్తాను.

  11. దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”

  12. కావలివాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. మీరు అడగాలనుకుంటే అడగండి; మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు.

  13. ఎఫ్రాయిం కొండలమీద కావలివారు, ‘రండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.”

  14. అతడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదుతాడు,

  15. అప్పుడు ఒకవేళ ఎవరైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్త పడకపోతే ఆ ఖడ్గం వచ్చి వారి ప్రాణాన్ని తీస్తుంది, వారి చావుకు వారే బాధ్యులు.

  16. వారు బూర శబ్దం విని కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. ఒకవేళ వారు ఆ హెచ్చరికకు జాగ్రత్తపడి ఉంటే, వారు తమ ప్రాణాలను కాపాడుకునేవారు.

  17. అయితే ఒకవేళ కావలివాడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి కూడా ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదకపోతే, ఖడ్గం వచ్చి ఎవరినైనా చంపితే, చనిపోయినవారు తమ పాపాల కారణంగా చనిపోయినప్పటికి, నేను ఆ కావలివాన్ని బాధ్యున్ని చేస్తాను.’

  18. ఒకవేళ ఇది అధిపతికి తెలిసినా, మేము అతనికి చెప్పి మీకు ఏ ప్రమాదం కలుగకుండా చూస్తాము” అని వారికి మాట ఇచ్చారు.

  19. హేరోదు పేతురు కోసం ఎంత వెదకినా కనబడలేదు, కాబట్టి అతడు కావలివారిని విచారించి, వారిని చంపమని ఆదేశించాడు. ఆ తర్వాత హేరోదు యూదయ ప్రాంతం నుండి కైసరయ పట్టణానికి వెళ్లి అక్కడ నివసించాడు.