Vows గురించి బైబిల్ వచనాలు: Mosaic laws concerning
Mosaic laws concerning గురించి వచనాలు
“ ‘ఇవి యెహోవా నియమించబడిన పండుగలు, వీటిని యెహోవాకు హోమబలులు, దహనబలులు, భోజనార్పణలు, బలులు, పానార్పణలు తీసుకురావడానికి పరిశుద్ధ సభలుగా మీరు ప్రకటించాలి. ఏ రోజు అర్పణ ఆ రోజు తీసుకురావాలి.
ఇవి యెహోవా సబ్బాతులకు, మీ బహుమానాలకు, మ్రొక్కుబడులకు, యెహోవాకు అర్పించే స్వేచ్ఛార్పణలన్నిటికి అధనంగా అర్పించవలసిన అర్పణలు.
“ ‘మీ మ్రొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలతో పాటు వీటిని నియమించబడిన పండుగల్లో యెహోవాకు అర్పించాలి: మీ దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు, సమాధానబలులు.’ ”