Vows గురించి బైబిల్ వచనాలు: Offering sacrifices
Offering sacrifices గురించి వచనాలు
“ ‘ఒకవేళ వారి అర్పణ మ్రొక్కుబడి కోసం గాని, స్వేచ్ఛార్పణ గాని అయితే, దానిని అర్పించిన రోజే తినాలి, అయితే మిగిలింది మరుసటిరోజు తినవచ్చు.
“అహరోనుతో అతని కుమారులతో, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీలో ఇశ్రాయేలీయుడైనా, ఇశ్రాయేలులో నివసించే పరదేశియైనా యెహోవాకు దహనబలిగా మ్రొక్కుబడిని గాని స్వేచ్ఛార్పణ గాని అర్పిస్తే,
యెహోవాకు గ్రుడ్డి దానిని గాని, గాయపడిన దానిని గాని లేదా అంగవైకల్యం ఉన్నదానిని గాని, చీముపట్టిన పుండ్లతో ఉన్నదానిని గాని అర్పించకూడదు. యెహోవాకు హోమబలిగా వీటిలో దేన్ని బలిపీఠం మీద ఉంచవద్దు.
యెహోవాకు ఇష్టమైన సువాసన కలుగునట్లు మీ మందల నుండి లేదా పశువుల నుండి అర్పణలు అంటే దహనబలులు గాని బలులు గాని, ప్రత్యేకమైన మ్రొక్కుబడులు గాని స్వేచ్ఛార్పణలు గాని, లేదా పండుగ అర్పణలు గాని అర్పించవచ్చు.