Skip to content

Voice గురించి బైబిల్ వచనాలు

12 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఆ జీవులు కదిలినప్పుడు నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది జలప్రవాహాల ఘోషలా, సర్వశక్తిమంతుని స్వరంలా, సైన్యం నుండి వచ్చే కోలాహలంలా ఉంది. అవి నిలబడినప్పుడు వాటి రెక్కలు క్రిందికి వాల్చాయి.

  2. వర్షం కురుస్తున్న రోజు మేఘాలలో వానవిల్లు కనిపించినట్లు, అతని చుట్టూ ఉన్న తేజస్సు కూడా అలాగే ఉంది. ఇది యెహోవా మహిమ రూపము. నేను దానిని చూసినప్పుడు, నేను నేల మీద పడిపోయాను, ఒక స్వరం నాకు వినిపించింది.

  3. కెరూబుల రెక్కల ధ్వని బయటి ఆవరణం వరకు, సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినిపించే స్వరంలా వినబడింది.

  4. నన్ను పంపిన తండ్రి తానే నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడు వినలేదు, ఆయన రూపాన్ని ఎప్పుడు చూడలేదు.

  5. తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో!” అన్నారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను దాన్ని మహిమపరిచాను, మళ్ళీ నేను మహిమపరుస్తాను” అని వినిపించింది.

  6. అప్పుడు అక్కడ నిలబడి ఉన్న జనసమూహం అది విని, ఇప్పుడు ఉరిమింది కదా అన్నారు. మిగిలిన వారు, “ఒక దేవదూత అతనితో మాట్లాడాడు” అని అన్నారు.

  7. అప్పుడు యేసు, “ఆ స్వరం నా కోసం రాలేదు అది మీ కోసమే వచ్చింది.

  8. అతడు అది చూసి, ఆ దర్శనానికి ఆశ్చర్యపడి స్పష్టంగా చూడడానికి దాని దగ్గరకు వెళ్తుండగా,

  9. అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం, “సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని అనడం విన్నాడు.

  10. సౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నవారు ఆ శబ్దాన్ని విన్నారు కాని మౌనంగా నిలబడిపోయారు, వారికి స్వరం వినబడింది కాని ఎవ్వరూ కనబడలేదు.

  11. అప్పుడు మేమందరం నేల మీద పడిపోయాం, అప్పుడు హెబ్రీ భాషలో నాతో, ‘సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికోలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని ఒక స్వరం చెప్పడం విన్నాను.

  12. “అప్పుడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ ‘నేను నీవు హింసిస్తున్న యేసును,