Tower గురించి బైబిల్ వచనాలు: Figurative of divine protection
Figurative of divine protection గురించి వచనాలు
నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు, నా రక్షణ కొమ్ము. ఆయన నా బలమైన కోట, నా ఆశ్రయం, నా రక్షకుడు హింసించేవారి నుండి నన్ను రక్షిస్తారు.
“ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని దయను చూపిస్తారు.”
యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.
ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం, శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము.
ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట, నా బలమైన కోట, నన్ను విడిపించేవారు. ఆయనే ప్రజలను నాకు లోబరచే, నా డాలు నా ఆశ్రయము.
యెహోవా నామం బలమైన కోట, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.