కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Gad గురించి బైబిల్ వచనాలు: Spoiled the Hagarites

5 వచనాలు · 25 కోణాలు

Spoiled the Hagarites గురించి వచనాలు

  1. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారిలో డాలు కత్తి పట్టుకోవడంలో నేర్పుగలవారు, విల్లు ఉపయోగించగలవారు, యుద్ధశిక్షణ తీసుకున్నవారు 44,760 మంది ఉన్నారు.

  2. వారు హగ్రీయీలతో, యెతూరువారితో, నాపీషువారితో, నోదాబువారితో యుద్ధం చేశారు.

  3. వారు యుద్ధ సమయంలో దేవునికి మొరపెట్టారు కాబట్టి దేవుడు వారికి సహాయం చేసి ఆ హగ్రీయీలను, వారితో ఉన్నవారందరిని వారి చేతికి అప్పగించారు. వారు ఆయన మీద నమ్మకముంచారు కాబట్టి ఆయన వారి ప్రార్థన అంగీకరించారు.

  4. వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు.

  5. ఇంకా చాలామంది శత్రువులను చంపారు ఎందుకంటే ఆ యుద్ధం దేవునిది. చెరకు వెళ్లేవరకు వారు అక్కడే నివసించారు.