The Resurrection of Christ గురించి బైబిల్ వచనాలు: Foretold by the prophets
Foretold by the prophets గురించి వచనాలు
ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.
కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు; వారి శరీరాలు పైకి లేస్తాయి మట్టిలో నివసిస్తున్నవారు, మేల్కొని సంతోషించాలి. మీ మంచు ఉదయపు మంచు వంటిది; భూమి తన మృతులకు జన్మనిస్తుంది.
ఆయన ఎప్పటికీ కుళ్ళిపోకూడదని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు. దేవుడు చెప్పినట్లే, “ ‘నేను దావీదుకు వాగ్దానం చేసిన పవిత్రమైన, నమ్మదగిన దీవెనలను మీకు అనుగ్రహిస్తాను.’
మరి ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.’