Skip to content

Tarsus గురించి బైబిల్ వచనాలు

6 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ప్రభువు అతనితో, “తిన్నని వీధిలో యూదా అనే వాని ఇంటికి వెళ్లి తార్సు నుండి వచ్చిన సౌలును గురించి అడుగు, ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు.

  2. దీనిని గురించి తెలుసుకొన్న విశ్వాసులు, అతన్ని కైసరయకు తీసుకువచ్చి తార్సుకు పంపించారు.

  3. ఆ తర్వాత బర్నబా సౌలును వెదకడానికి తార్సు పట్టణానికి వెళ్లి,

  4. అతన్ని కలుసుకొని అంతియొకయ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఒక సంవత్సరం అంతా బర్నబా సౌలు ఆ సంఘంతో కలిసి ఉంటూ అనేకమందికి బోధించారు. అంతియొకయలో శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు.

  5. అందుకు పౌలు, “నేను కిలికియ ప్రాంతంలోని తార్సు పట్టణానికి చెందిన యూదుడను, ఆ గొప్ప పట్టణ పౌరుడిని. అయితే దయచేసి ప్రజలతో నన్ను మాట్లాడ నివ్వండి!” అన్నాడు.

  6. “నేను కిలికియ ప్రాంతపు తార్సు పట్టణంలో పుట్టిన యూదుడను, కాని ఈ పట్టణంలోనే పెరిగి పెద్దవాడినయ్యాను, గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర మన పితరుల ధర్మశాస్త్ర విద్యను పూర్తిగా అభ్యసించాను. మీరందరిలా నేను కూడా దేవుని కోసం ఆసక్తి కలవాన్ని.