Skip to content

Sobriety గురించి బైబిల్ వచనాలు

16 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి.

  2. కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము.

  3. అయితే మనం పగటికి చెందినవారం కాబట్టి తెలివి కలిగి, విశ్వాసం ప్రేమ అనే కవచాన్ని, రక్షణ పొందాలనే ఆ ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకొంటాము.

  4. అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ,

  5. సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్థ్యం గలవానిగా ఉండాలి.

  6. అతడు త్రాగుబోతై ఉండకూడదు, చేయి చేసుకునేవాడు కాక, మృదు స్వభావం గలవానిగా ఉండాలి, కొట్లాడేవానిగా, డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు.

  7. అదే విధంగా, సంఘపరిచారకుల భార్యలు కూడా గౌరవించదగినవారిగా ఉండాలి, ద్వేషంతో మాట్లాడేవారిగా కాకుండా కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా ప్రతి విషయంలో నమ్మకమైనవారిగా ఉండాలి.

  8. దానికి బదులు, అతడు ఆతిథ్యాన్ని ఇచ్చేవానిగా, మంచిని ప్రేమించేవానిగా, స్వీయ నియంత్రణ కలవానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, క్రమశిక్షణ కలవాడై ఉండాలి.

  9. వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు.

  10. అప్పుడు వారు యవ్వన స్త్రీలకు తమ భర్తలను బిడ్డలను ప్రేమించుమని,

  11. అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండమని యవ్వన పురుషులను ప్రోత్సహించు.

  12. మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది.

  13. మనం భక్తిహీనతను ఈ లోక కోరికలను తృణీకరించి, దివ్య నిరీక్షణ కోసం అనగా, మన గొప్ప దేవుడును రక్షకుడైన యేసు క్రీస్తు తన మహిమతో కనబడతాడనే ఆ దివ్య నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ, స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది.

  14. కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి.

  15. అన్నిటికి అంతం సమీపించింది, కాబట్టి మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.

  16. మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.