Shephatiah గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు; అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు;
అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు; దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు.
యెరోహాము కుమారుడైన ఇబ్నియా; మిక్రి కుమారుడైన ఉజ్జీకి పుట్టిన ఏలా; ఇబ్నెయా కుమారుడైన రెయూయేలుకు పుట్టిన షెఫట్యా కుమారుడైన మెషుల్లాము.
ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫట్యా;
ఇశ్రాయేలీయుల గోత్రాల నాయకులు: రూబేనీయులమీద: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు; షిమ్యోనీయుల మీద: మయకా కుమారుడైన షెఫట్యా;
వీరు యెహోరాము సహోదరులు, అంటే యెహోషాపాతు కుమారులు: అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్యా. వీరంతా ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు.
షెఫట్యా వారసులు 372;
షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, అమీ వారసులు.
షెఫట్యా వారసుల నుండి: మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితో పాటు నమోదైన 80 మంది పురుషులు;
షెఫట్యా వారసులు 372;
షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, ఆమోను వారసులు.
యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): యూదా వారసుల నుండి: అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;
మత్తాను కుమారుడైన షెఫట్యా, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకాలు, మల్కీయా కుమారుడైన పషూరు యిర్మీయా ప్రజలందరితో చెప్పేది విని,
అప్పుడు ఆ అధికారులు రాజుతో, “ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇతడు ఈ పట్టణంలో మిగిలి ఉన్న సైనికులను, అలాగే ప్రజలందరినీ తాను వారితో చెప్పే మాటల ద్వార నిరుత్సాహపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజల క్షేమం కోరడంలేదు, వారి పతనాన్ని కోరుతున్నాడు.”