కంటెంట్‌కు వెళ్లండి

Shalmaneser గురించి బైబిల్ వచనాలు: King of Assyria, overthrows the kingdom of Israel.

7 వచనాలు · 1 కోణం

King of Assyria, overthrows the kingdom of Israel. గురించి వచనాలు

  1. అష్షూరు రాజైన షల్మనేసెరు హోషేయ మీద దాడి చేయడానికి రాగా హోషేయ అతనికి లొంగిపోయి అతనికి పన్ను చెల్లించాడు.

  2. అయితే హోషేయ కుట్ర చేస్తున్నట్టు అష్షూరు రాజు పసిగట్టాడు, ఎందుకంటే హోషేయ, ఈజిప్టు రాజైన సో దగ్గరకు దూతలను పంపి ప్రతి సంవత్సరం అష్షూరు రాజుకు చెల్లించే పన్ను చెల్లించడం మానేశాడు; కాబట్టి షల్మనేసెరు అతన్ని పట్టుకుని చెరసాలలో వేశాడు.

  3. అప్పుడు అష్షూరు రాజు దేశానంతా ఆక్రమించి, సమరయ మీదికి దండెత్తి దాన్ని మూడేళ్ళ వరకు ముట్టడించాడు.

  4. హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు సమరయను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు. హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.

  5. రాజైన హిజ్కియా పరిపాలన యొక్క నాలుగవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క ఏడవ సంవత్సరంలో, అష్షూరు రాజైన షల్మనేసెరు సమరయ మీదికి దండెత్తి దాన్ని ముట్టడించాడు.

  6. మూడు సంవత్సరాల ముగింపులో అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. కాబట్టి హిజ్కియా పరిపాలన యొక్క ఆరవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజైన హోషేయ పరిపాలన యొక్క తొమ్మిదవ సంవత్సరంలో సమరయ స్వాధీనపరచుకోబడింది.

  7. అష్షూరు రాజు ఇశ్రాయేలును చెరగా తీసుకెళ్లి, హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.