Self-Will and Stubbornness గురించి బైబిల్ వచనాలు: Refusing to walk in the ways of God
Refusing to walk in the ways of God గురించి వచనాలు
మీకు అవిధేయులుగా ఉండి, మీరు వారి మధ్య చేసిన అద్భుతాలను మరచిపోయారు. ఈజిప్టులో తమ బానిసత్వానికి తిరిగి వెళ్లడానికి ఒక నాయకుని ఏర్పరచుకుని తిరుగుబాటు చేశారు. అయితే మీరు క్షమించే దేవుడవు దయా కనికరం ఉన్నవారు, త్వరగా కోప్పడరు, అపరిమితమైన ప్రేమ ఉన్నవారు కాబట్టి వారిని విడిచిపెట్టలేదు.
వారు దేవుని నిబంధనను పాటించలేదు, ఆయన న్యాయవిధుల ప్రకారం జీవించడానికి నిరాకరించారు.
యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించింది, ఇశ్రాయేలును దోపిడి చేసేవారికి అప్పగించింది ఎవరు? యెహోవా కాదా, మేము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కాదా? వారు ఆయన మార్గాలను అనుసరించలేదు ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు.
యెహోవా ఇలా చెప్తున్నారు: “కూడలిలో నిలబడి చూడండి; పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’