Skip to content

Rimmon గురించి బైబిల్ వచనాలు

8 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. మిగిలిన వారు అరణ్యం వైపు, రిమ్మోను బండ వైపు పారిపోతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు రహదారుల వెంట అయిదువేల మందిని హతం చేశారు. వారింకా బెన్యామీనీయులను గిదోము వరకు తరుముతూ ఇంకొక రెండువేలమందిని హతం చేశారు.

  2. అయితే వారిలో ఆరువందలమంది మాత్రం తప్పించుకు వెళ్లి అరణ్యంలో ఉన్న రిమ్మోను బండ దగ్గరకు పారిపోయి అక్కడ నాలుగు నెలలు ఉండిపోయారు.

  3. అప్పుడు సమాజమంతా రిమ్మోను బండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో సమాధానపడదాం అని కబురు పంపారు.

  4. సౌలు కుమారునికి ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు; ఒకని పేరు బయనా రెండవ వాని పేరు రేకాబు; వారు బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశానికి చెందిన భూభాగము.

  5. బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, బయనా ఇష్-బోషెతు ఇంటికి బయలుదేరారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అతడు విశ్రాంతి తీసుకుంటుండగా వారు అక్కడికి వచ్చారు.

  6. దావీదు బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, అతని సోదరుడు బయనాకు ఇలా జవాబిచ్చాడు: “నిశ్చయంగా, అన్ని కష్టాల నుండి నన్ను విడిపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న,

  7. అయితే ఒక్క విషయంలో యెహోవా మీ దాసుడనైన నన్ను క్షమించాలి: నా యజమానుడు మ్రొక్కుకోడానికి రిమ్మోను గుడిలోకి వెళ్తూ నా చేయి మీద ఆనుకున్నప్పుడు నేను కూడా రిమ్మోను గుడిలో వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ దాసుడనైన నన్ను యెహోవా క్షమించును గాక” అని అన్నాడు.

  8. లేవీయులలో మిగిలిన వారైన మెరారీయులకు లభించిన పట్టణాలు: జెబూలూను గోత్ర ప్రదేశంలో నుండి యొక్నెయాము, కర్తహు, రిమ్మోను, తాబోరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;