Skip to content

Righteous గురించి బైబిల్ వచనాలు

11 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కానీ నేను మీతో, “మీరు వారి భూమిని స్వాధీనం చేసుకుంటారు; పాలు తేనెలు ప్రవహించే భూమిని నేను మీకు వారసత్వంగా ఇస్తాను” అని చెప్పాను. దేశాల్లో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

  2. “ ‘అందువల్ల మీరు పవిత్రమైన జంతువులకు అపవిత్రమైన జంతువులకు, పవిత్రమైన పక్షులకు అపవిత్రమైన పక్షులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అపవిత్రమైనవని మీకు వేరుచేసి చెప్పిన ఏ జంతువు వలన గాని పక్షి వలన గాని నేల మీద ప్రాకే దేనివలన గాని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.

  3. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే, నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను, జనాల్లో నుండి నేను మిమ్మల్ని నా సొంతవారిగా ప్రత్యేకించుకున్నాను.

  4. మీకు భయపడేవారి కోసం మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది!

  5. మనుష్యుల కుట్రలకు గురికాకుండ మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు; నిందించే నాలుకల నుండి తప్పించి వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు.

  6. సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”

  7. జీవానికి వెళ్లడానికి ప్రవేశించే ద్వారం ఇరుకుగా దారి ఇరుకుగా ఉంటుంది. కొంతమందే దాన్ని కనుగొంటారు.

  8. “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.”

  9. నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన కత్తిరించి పారవేస్తారు. ఫలించే ప్రతితీగె అధికంగా ఫలించడానికి ఆయన దానిని కత్తిరించి సరిచేస్తారు.

  10. నేను మీలో నిలిచేలా మీరు నాలో నిలిచి ఉండండి. ఒక ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదు; అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే తప్ప ఫలించలేరు.

  11. “నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు. మీరు నాలో ఉండి, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. నా నుండి మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు.