Rest గురించి బైబిల్ వచనాలు: The annual feasts added rest days
The annual feasts added rest days గురించి వచనాలు
మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.
ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి. ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.’ ”
అదే రోజు పరిశుద్ధ సభను ప్రకటించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. మీరెక్కడున్నా ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
సాధారణ పని చేయకూడదు కాని యెహోవాకు హోమబలి అర్పించాలి.’ ”
ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు, ఎందుకంటే అది ప్రాయశ్చిత్త దినం, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ కోసం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది.
ఆ రోజు ఎవరైనా పని చేస్తే, వారని తమ ప్రజల నుండి నిర్మూలం చేస్తాను.
మీరు ఏ పని చేయకూడదు. మీరు ఎక్కడున్నా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
మొదటి రోజు పరిశుద్ధ సభ నిర్వహించాలి; ఆ రోజు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి, ఎనిమిదవ రోజు పరిశుద్ధ సభ నిర్వహించి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది ప్రత్యేక సభ ముగింపు; అప్పుడు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.
ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
“ ‘ప్రథమ ఫలాల రోజున, వారాల పండుగలో యెహోవాకు క్రొత్త ధాన్యంతో భోజనార్పణ అర్పించినప్పుడు పరిశుద్ధ సభ ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
“ ‘ఏడవ నెల మొదటి రోజు పరిశుద్ధ సభను ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. ఆ రోజు మీరు బూరల ధ్వని చేసే రోజు.
“ ‘ఏడవ నెల పదవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి. మీరు ఉపవాసముండాలి ఏ పని చేయకూడదు.
“ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి.
“ ‘ఎనిమిదవ రోజున ప్రత్యేక సభగా కూడుకోవాలి, పని ఏదీ చేయకూడదు.