Skip to content

Rapha గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అక్కడ రాఫా సంతతివాడైన ఇష్బి-బెనోబు అనేవాడు క్రొత్త ఖడ్గం, మూడువందల షెకెళ్ళ బరువు ఉన్న ఇత్తడి ఈటె పట్టుకుని, “దావీదును చంపుతాను” అని అన్నాడు.

  2. గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.

  3. ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.

  4. నాలుగవవాడు నోహా, అయిదవవాడు రాపా.

  5. మోజా బిన్యాకు తండ్రి; అతని కుమారుడు రాపా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.

  6. మోజా బిన్యాకు తండ్రి; బిన్యా కుమారుడు రెఫాయా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.

  7. కొంతకాలం తర్వాత, గెజెరు దగ్గర ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై, రెఫాయీయుల వారసుడైన సిప్పయి అనే వాన్ని చంపగా ఫిలిష్తీయులు లొంగిపోయారు.

  8. గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.

  9. వీరు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.