కంటెంట్‌కు వెళ్లండి

Privileges of Saints గురించి బైబిల్ వచనాలు: Secure during public calamities

13 వచనాలు · 36 కోణాలు

Secure during public calamities గురించి వచనాలు

  1. కరువు కాలంలో చావు నుండి, యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు.

  2. ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు, అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి.

  3. దావీదు కీర్తన. యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను?

  4. నన్ను మ్రింగివేయాలని దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నా శత్రువులు నా పగవారు తూలి పడిపోతారు.

  5. సైన్యం నన్ను ముట్టడించినా, నా హృదయం భయపడదు; నా మీదికి యుద్ధానికి వచ్చినా, నేను ధైర్యం కోల్పోను.

  6. యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.

  7. ఆపద సంభవించిన దినాన ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు.

  8. రాత్రి భయాలకు గాని, పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని,

  9. చీకటిలో సంచరించే తెగులుకు గాని, మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని, నీవు భయపడాల్సిన అవసరం లేదు.

  10. నీ ప్రక్కన వేయిమంది, నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలవచ్చు, అయినా, అది నీ దగ్గరకు రాదు.

  11. నీవు నీ కళ్లతో గమనిస్తావు దుష్టులు శిక్ష పొందడం నీవు చూస్తావు.

  12. “యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని, మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే,

  13. ఏ హాని నీ మీదికి రాదు, ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు.