Skip to content

Prayerlessness గురించి బైబిల్ వచనాలు

15 వచనాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. నీవు భక్తిని విడిచిపెట్టి దేవుని గురించిన ధ్యానాన్ని అడ్డగిస్తున్నావు.

  2. అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు.

  3. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  4. సర్వశక్తిమంతునిలో వారు ఆనందం పొందుతారా? అన్నివేళల్లో వారు దేవునికి మొరపెడతారా?

  5. కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు.

  6. కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు.

  7. మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరట మొరపెట్టని, రాజ్యాల మీద, మీ ఉగ్రతను కుమ్మరించండి.

  8. “అయినా యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలూ, నా గురించి నీవు విసిగిపోయావు.

  9. ఎవరూ మీ పేరిట మొరపెట్టడం లేదు మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి ఆరాటపడడం లేదు. మీరు మా నుండి మీ ముఖం దాచుకున్నారు. మమ్మల్ని మా పాపాలకు అప్పగించారు.

  10. కాపరులు తెలివిలేనివారు వారు యెహోవా దగ్గర విచారణ చేయరు; కాబట్టి వారు వర్ధిల్లరు వారి మంద అంతా చెదరిపోయింది.

  11. మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.

  12. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే, ఈ విపత్తు అంతా మా మీదికి వచ్చింది, అయినా మేము పాపాలను వదిలి, మీ సత్యం వైపు దృష్టి పెట్టక, మా దేవుడైన యెహోవా చూపించు దయను కోరలేదు.

  13. వారంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు; వారు తమ పాలకులను మ్రింగివేస్తారు వారి రాజులందరూ కూలిపోతారు, వారిలో ఏ ఒక్కడు నన్ను ప్రార్థించడు.

  14. ఓడ నాయకుడు అతని దగ్గరకు వెళ్లి, “నీవు ఎలా పడుకోగలుగుతున్నావు? లేచి నీ దేవునికి మొరపెట్టు! ఒకవేళ ఆయన మనల్ని గమనించి మనం నశించకుండా చేస్తారేమో” అని అన్నాడు.

  15. యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.”