Skip to content

Poverty గురించి బైబిల్ వచనాలు

12 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.

  2. ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం, కాని దరిద్రత పేదవారి నాశనం.

  3. నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.

  4. అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు.

  5. నిద్రను ప్రేమించకు దరిద్రుడవవుతావు; నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం మిగులుతుంది.

  6. ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులౌతారు, మగత వారిని దుప్పట్లలో వస్త్రాల్లా ధరిస్తుంది.

  7. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను.

  8. పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.

  9. తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి దరిద్రత నిండుతుంది.

  10. అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి; దరిద్రతను గాని ధనాన్ని గాని నాకు ఇవ్వకండి, కాని నా వాటాను మాత్రం నాకు ఇవ్వండి.

  11. ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి, ‘యెహోవా ఎవరు?’ అని అంటానేమో పేదవాడినైతే దొంగతనం చేసి నా దేవుని నామానికి అవమానం తెస్తానేమో.

  12. రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతినిండ నెమ్మది ఉంటే అది ఎంతో మేలు.