Post గురించి బైబిల్ వచనాలు: Of Ahasuerus
Of Ahasuerus గురించి వచనాలు
అదారు అనే పన్నెండవ నెల పదమూడవ రోజున యువకుల నుండి ముసలివారి వరకూ స్త్రీలు, పిల్లలు అని తేడా లేకుండా ఒకే రోజులోనే యూదులనందరిని చంపి నాశనం చేసి, వారి ఆస్తులను దోచుకోవాలని శాసనాలు వార్తాహరుల ద్వారా రాజు సంస్థానాలన్నిటికి పంపబడ్డాయి.
అది రాజాజ్ఞ కాబట్టి వార్తాహరులు వెంటనే బయలుదేరి వెళ్లారు. ఆ ఆజ్ఞ షూషను కోటలో అందించడం జరిగింది. రాజు, హామాను త్రాగడానికి కూర్చుకున్నారు, కాని షూషను పట్టణం ఆందోళనగా ఉంది.
మొర్దెకై రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులను వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి, రాజు సేవకు ప్రత్యేకంగా ఉపయోగించే గుర్రాలపై వేగంగా స్వారీ చేసే వార్తాహరులతో వాటిని పంపాడు.
రాజాజ్ఞ ప్రకారం వార్తాహరులు, రాజ్య గుర్రాల మీద వేగంగా స్వారీ చేస్తూ వెళ్లి, ఆ శాసనాలను షూషను కోటలో అందజేశారు.