Skip to content

Penitent గురించి బైబిల్ వచనాలు: Promises to

131 వచనాలు · 1 కోణం

Promises to గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘కాని వారు తమ పాపాలను, వారి పూర్వికుల పాపాలను ఒప్పుకుని అంటే వారు నాకు చేసిన ద్రోహం, తద్వార నేను వారికి విరుద్ధంగా నడిచి, వారిని శత్రువుల దేశానికి పంపానని ఒప్పుకుని, అంటే సున్నతిలేనివారి హృదయాలు తగ్గించుకొని వారి పాపాలకు వారు మూల్యం చెల్లిస్తే,

  2. And that I also have walked contrary unto them, and have brought them into the land of their enemies; if then their uncircumcised hearts be humbled, and they then accept of the punishment of their iniquity:

  3. నేను యాకోబుతో నా నిబంధనను, ఇస్సాకుతో నా నిబంధనను, అబ్రాహాముతో నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను.

  4. “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏ స్త్రీ గాని, పురుషుడు గాని యెహోవా పట్ల ద్రోహులై మనుష్యులు చేసే పాపాల్లో దేనినైనా చేసి అపరాధులైతే,

  5. వారు వారి పాపాన్ని ఒప్పుకుని వారు చేసిన అపరాధానికి పూర్ణ ప్రాయశ్చిత్తం చేయాలి, చేసిన తప్పుకు అయిదవ వంతు చేర్చి ఎవరికి విరుద్ధంగా తప్పు చేశారో వారికి ఇవ్వాలి.

  6. అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.

  7. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ సంగతులన్ని మీకు జరిగిన తర్వాత, అప్పుడు చివరి రోజుల్లో మీరు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటారు.

  8. మీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు; కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, ఆయన మీ పూర్వికులతో ప్రమాణం ద్వార నిశ్చయం చేసిన నిబంధనను మరచిపోరు.

  9. వారికి వారి సంతతికి నిరంతరం క్షేమం కలిగేలా వారు నా పట్ల భయం కలిగి, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే హృదయం వారికుంటే ఎంతో మంచిది.

  10. నేను మీ ముందుంచిన ఈ దీవెనలు, శాపాలన్నీ మీ మీదికి వచ్చి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లో మీరు వాటిని హృదయంలో భద్రం చేసుకుని,

  11. మీరు మీ పిల్లలు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగివచ్చి, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ప్రతీదాని ప్రకారం మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణ ఆత్మతో ఆయనకు లోబడితే,

  12. మీ దేవుడైన యెహోవా మీ భాగ్యాలను పునరుద్ధరిస్తారు, మీపై కనికరం చూపించి ఆయన మిమ్మల్ని చెదరగొట్టిన అన్ని దేశాలన్నిటి నుండి మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తారు.

  13. మీరు ఆకాశం క్రింద అత్యంత సుదూర దేశానికి చెదరిపోయినప్పటికి, అక్కడినుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి తిరిగి తీసుకువస్తారు.

  14. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మీ పూర్వికులకు చెందిన దేశానికి తీసుకువస్తారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీ పూర్వికులకంటే ఆయన మిమ్మల్ని వృద్ధిలోను, సంఖ్యలోను అధికం చేస్తారు.

  15. మీ దేవుడైన యెహోవా మీ హృదయాలను, మీ సంతతివారి హృదయాలను సున్నతి చేస్తారు. అప్పుడు మీరు ఆయనను మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించి జీవిస్తారు.

  16. మీ దేవుడైన యెహోవా ఈ శాపాలన్నింటినీ మిమ్మల్ని ద్వేషించే, మిమ్మల్ని హింసించే మీ శత్రువులపైకి తెస్తారు.

  17. మీరు తిరిగివచ్చిన తర్వాత యెహోవాకు లోబడి ఆయన ఆజ్ఞలన్నిటిని పాటిస్తారు.

  18. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ చేతిపనులన్నిటిలోను మీ గర్భఫలాల్లో మీ పశువుల పిల్లల్లోను మీ భూమిలోని పంటల్లోను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు. యెహోవా మీ పూర్వికుల విషయంలో సంతోషించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు.

  19. అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై ఉండి, ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను శాసనాలను పాటించి మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో యెహోవా వైపు తిరగాలి.

  20. వారు శపించబడి నాశనమవుతారని ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం స్పందించి నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.

  21. “సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.

  22. ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి

  23. నీ బంగారాన్ని మట్టిలో ఓఫీరు బంగారాన్ని కనుమల రాళ్లలో పారవేస్తే,

  24. అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు బంగారం, నీకు ప్రశస్తమైన వెండి అవుతాడు.

  25. అప్పుడు నీవు ఖచ్చితంగా సర్వశక్తిమంతునిలో ఆనందిస్తావు దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు.