Midianites గురించి బైబిల్ వచనాలు: Terrified at approach of Israel
Terrified at approach of Israel గురించి వచనాలు
దేవుడు తేమాను నుండి వచ్చాడు, పరిశుద్ధుడు పారాను పర్వతం నుండి వచ్చాడు. సెలా ఆయన మహా వైభవం ఆకాశాలను కప్పివేసింది భూమి ఆయన స్తుతితో నిండింది.
ఆయన తేజస్సు సూర్యకాంతిలా ఉంది; ఆయన చేతిలో నుండి కిరణాలు బయలువెళ్తున్నాయి, అక్కడ ఆయన శక్తి దాగి ఉంది.
ఆయనకు ముందుగా తెగులు వెళ్లింది; అంటువ్యాధి ఆయన పాదాలను అనుసరించింది.
ఆయన నిలబడగా భూమి కంపించింది; ఆయన చూడగా దేశాలు వణికాయి. పురాతన పర్వతాలు కూలిపోయాయి పురాతన కొండలు అణగిపోయాయి కానీ ఆయన మార్గాలు శాశ్వతమైనవి.
భయంలో ఉన్న కూషీయుల గుడారాలను, వేదనలో ఉన్న మిద్యానువాసుల నివాసాలను నేను చూశాను.