Judgments గురించి బైబిల్ వచనాలు: Upon the Canaanites
Upon the Canaanites గురించి వచనాలు
మీరు దాడి చేసి వెళ్లగొట్టబోతున్న జనాంగాలను మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి తొలగిస్తారు. అయితే మీరు వారిని వెళ్లగొట్టి వారి దేశంలో స్థిరపడిన తర్వాత,
వారు మీ ఎదుట నుండి నిర్మూలమైనప్పుడు, మీరు వారి పద్ధతులను అనుసరించి, “ఈ ప్రజలు తమ దేవుళ్ళను ఎలా సేవిస్తున్నారు? మేము కూడా అలాగే చేస్తాము” అని అంటూ చిక్కుల్లో పడిపోకుండా జాగ్రత్తపడండి.
వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.
నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు పాటించేలా చూడండి; దానికి ఏది కలపవద్దు, దానిలో నుండి ఏది తీసివేయవద్దు.