కంటెంట్‌కు వెళ్లండి

Jehoiachin గురించి బైబిల్ వచనాలు: King of Judah and successor to Jehoiakim

5 వచనాలు · 10 కోణాలు

King of Judah and successor to Jehoiakim గురించి వచనాలు

  1. యెహోయాకీము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు.

  2. ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు నది వరకు ఈజిప్టు రాజు వంశంలో ఉన్న ప్రదేశాలన్నిటినీ బబులోను రాజు స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి అతడు తన సొంత దేశాన్ని విడిచి బయటకు రాలేదు.

  3. యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి ఎల్నాతాను కుమార్తెయైన నెహుష్తా; ఈమె యెరూషలేము నగరవాసి.

  4. యెహోయాకీము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన అసహ్యకరమైనవి, అతనికి వ్యతిరేకంగా కనిపించినవన్నీ ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు.

  5. యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు పరిపాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.