Incest గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“ ‘ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.
“ ‘నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకుని నీ తండ్రిని అగౌరపరచవద్దు. ఆమె నీ తల్లి; ఆమెతో లైంగిక సంబంధం ఉండకూడదు.
“ ‘నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ తండ్రిని అగౌరపరుస్తుంది.
“ ‘నీ సోదరితో అనగా అదే ఇంట్లో పుట్టిన లేదా వేరొక చోట పుట్టిన నీ తండ్రి కుమార్తెతో గాని నీ తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.
“ ‘నీ కుమారుని కుమార్తెతో గాని నీ కుమార్తె కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నిన్ను అగౌరపరుస్తుంది.
“ ‘నీ తండ్రి భార్యకు పుట్టిన కుమార్తెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ సోదరి.
“ ‘నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
“ ‘నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
“ ‘నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని అతన్ని అగౌరపరచవద్దు; ఆమె నీ పినతల్లి.
“ ‘నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. ఆమె మీ కుమారుని భార్య; ఆమెతో సంబంధం పెట్టుకోవద్దు.
“ ‘నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ సోదరుని అగౌరపరుస్తుంది.
“ ‘ఒక స్త్రీతో, ఆమె కుమార్తెతో కూడా లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. ఆమె కుమారుని కుమార్తెతో గాని కుమార్తె యొక్క కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; వారు ఆమె సమీప బంధువులు. అది దుష్టత్వము.
“ ‘నీ భార్య బ్రతికి ఉండగా నీ భార్యను బాధపెట్టడానికి ఆమె సోదరిని భార్యగా చేసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.
“ ‘తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం ఉన్నవాడు తన తండ్రిని అగౌరపరిచాడు. ఆ స్త్రీ పురుషులిద్దరినీ చంపేయాలి; వారి మరణానికి వారే బాధ్యులు.
“ ‘ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం కలిగియుంటే, వారిద్దరినీ చంపేయాలి; వారు వక్రబుద్ధికి పాల్పడ్డారు; వారి మరణానికి వారే బాధ్యులు.
“ ‘మీ తల్లి సోదరితో గాని మీ తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధం పెట్టుకోకండి, ఎందుకంటే అది రక్తసంబంధాన్ని అగౌరపరచడమే; వారి శిక్షకు వారే బాధ్యులు.
“ ‘ఒకడు తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకుంటే, అతడు మామను అగౌరపరచినట్టు. వారి పాపశిక్షకు వారే బాధ్యులు; వారు సంతానం లేకుండా చస్తారు.
“ ‘ఒకడు తన సోదరుని భార్యను పెళ్ళి చేసుకోవడం అపవిత్రమైన పని; అతడు తన సోదరున్ని అగౌరపరచినట్టే వారికి సంతానం కలుగదు.
“తోబుట్టువుతో అనగా తన తండ్రి కుమార్తెతో గాని, తన తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
“అత్తతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.