కంటెంట్‌కు వెళ్లండి

Heshbon గురించి బైబిల్ వచనాలు: Prophecy concerning

5 వచనాలు · 5 కోణాలు

"Heshbon" కోసం వెతకండి

Prophecy concerning గురించి వచనాలు

  1. “నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.

  2. క్షేత్రాల దగ్గర అర్పణలు అర్పించేవారిని మోయాబులో తమ దేవుళ్ళకు ధూపం వేసేవారిని నేను మోయాబులో లేకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  3. అమ్మోనీయుల గురించి: యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇశ్రాయేలుకు కుమారులు లేరా? ఇశ్రాయేలుకు వారసుడు లేడా? మోలెకు గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? అతని ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తున్నారు?

  4. అయితే ఆ రోజులు రాబోతున్నాయి” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అమ్మోనీయుల రబ్బాకు వ్యతిరేకంగా నేను యుద్ధధ్వని చేసినప్పుడు; అది శిథిలాల దిబ్బ అవుతుంది, దాని చుట్టుప్రక్కల గ్రామాలు అగ్నికి ఆహుతి అవుతాయి. అప్పుడు ఇశ్రాయేలు దాన్ని వెళ్లగొట్టిన వారిని వెళ్లగొడుతుంది,” అని యెహోవా అంటున్నారు.

  5. “హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది! రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి! గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి; గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి, ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.