కంటెంట్‌కు వెళ్లండి

Friendship గురించి బైబిల్ వచనాలు

31 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి, స్నేహితుని వల్ల కలిగే వినోదం వారి హృదయపూర్వక సలహా ద్వార వస్తుంది.

  2. నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు.

  3. ఒకరికంటే ఇద్దరు మేలు, ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది:

  4. ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు. ఒంటరివాడు పడితే లేవనెత్తేవాడెవడూ ఉండడు.

  5. అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు?

  6. ఒంటరి వారిని పడద్రోయడం తేలిక, ఇద్దరు కలిసి తమను తాము రక్షించుకోగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.