False Prophets గురించి బైబిల్ వచనాలు: Not sent or commissioned by God
Not sent or commissioned by God గురించి వచనాలు
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “ప్రవక్తలు నా పేరుతో అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారిని నియమించలేదు, అసలు వారితో మాట్లాడలేదు. వారు మీకు తప్పుడు దర్శనాలు, భవిష్యవాణి, బూటకపు మాటలు వారి సొంత మనస్సు యొక్క భ్రమలు ప్రవచిస్తున్నారు.
నేను ఈ ప్రవక్తలను పంపలేదు, అయినాసరే వారు తమ సొంత సందేశంతో పరుగెత్తుకు వచ్చారు; నేను వారితో మాట్లాడలేదు, అయినాసరే వారు ప్రవచించారు.
“బందీలుగా ఉన్నవారందరికి ఈ సందేశం పంపు, ‘నెహెలామీయుడైన షెమయా గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను అతన్ని పంపలేదు, అయినాసరే షెమయా మీకు ప్రవచించి మీరు ఆ అబద్ధాలను నమ్మేలా చేశాడు.