కంటెంట్‌కు వెళ్లండి

Creditors గురించి బైబిల్ వచనాలు: Often cruel in exacting debts

13 వచనాలు · 21 కోణాలు

Often cruel in exacting debts గురించి వచనాలు

  1. అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి,

  2. “యూదేతరులకు అమ్మివేయబడిన మన తోటి యూదులను మా శక్తికొలది మేము విడిపించాము. మీరు మీ సొంత ప్రజలను అమ్ముతున్నారు; వారు మరలా మనకు అమ్మబడవచ్చా?” అని అడిగినప్పుడు వారేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.

  3. నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా?

  4. తండ్రిలేనివారి గాడిదను తోలుకుపోతారు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకెళ్తారు.

  5. వారు నిరుపేదలను దారి నుండి గెంటివేస్తారు. దేశంలో ఉన్న పేదలందరిని దాక్కునేలా చేస్తారు.

  6. అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్లు పేదవారు ఆహారాన్ని వెదుకుతూ తిరుగుతారు; బంజరు భూమి వారి పిల్లలకు ఆహారాన్ని ఇస్తుంది.

  7. వారు పొలాల్లో పశుగ్రాసం సేకరిస్తారు దుష్టుల ద్రాక్షతోటల్లో రాలిపోయిన వాటిని ఏరుకుంటారు.

  8. బట్టలు లేదా, రాత్రంతా దిగంబరంగా గడుపుతారు; చలికి కప్పుకోడానికి వారికి ఏమి లేదు.

  9. పర్వతాలపై జడివానలో వారు తడిసిపోతారు. నిలువనీడ కోసం బండలను కౌగిలించుకుంటారు.

  10. దుష్టుడు తండ్రిలేని పిల్లలను రొమ్ము నుండి లాగివేస్తాడు; వారు పేదవారి శిశువును తాకట్టుగా తీసుకుంటారు.

  11. “కానీ వాడు బయటకు వెళ్లి తనకు వంద వెండి దేనారాలు బాకీ ఉన్న తన తోటి పనివానిలో ఒకనిని చూసి, ‘నీవు తీసుకున్న బాకీ తిరిగి చెల్లించు!’ అని వాని గొంతు పట్టుకున్నాడు.

  12. “అందుకు ఆ తోటి పనివాడు అతని పాదాల మీద పడి ‘నా విషయం కొంచం ఓపిక పట్టు, నేను బాకీ అంతా తీర్చేస్తాను’ అని బ్రతిమాలాడు.

  13. “అయితే అతడు దానికి ఒప్పుకోలేదు. బదులుగా, వాడు బాకీ తీర్చేవరకు వానిని జైలులో వేయించాడు.