కంటెంట్‌కు వెళ్లండి

Countenance గురించి బైబిల్ వచనాలు

11 వచనాలు · 9 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. మోషే తన చేతుల్లో ఆ రెండు నిబంధన పలకలను మోస్తూ సీనాయి పర్వతం దిగివస్తున్నప్పుడు, అతడు యెహోవాతో మాట్లాడాడు కాబట్టి అతని ముఖం ప్రకాశమానంగా ఉందని అతనికి తెలియదు.

  2. అహరోను, ఇశ్రాయేలీయులందరు మోషేను చూసినప్పుడు అతని ముఖం ప్రకాశవంతంగా ఉంది కాబట్టి అతని దగ్గరకు వెళ్లడానికి వారు భయపడ్డారు.

  3. అయితే మోషే వారిని పిలిచాడు; కాబట్టి అహరోను, సమాజ నాయకులు అతని దగ్గరకు తిరిగి వచ్చారు, అతడు వారితో మాట్లాడాడు.

  4. ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరు అతని దగ్గరకు రాగా సీనాయి పర్వతం మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అతడు వారికిచ్చాడు.

  5. మోషే వారితో మాట్లాడడం ముగించినప్పుడు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.

  6. అయితే మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్లినప్పుడెల్లా బయటకు వచ్చేవరకు అతడు ముసుగు తీసివేసేవాడు. అతడు బయటకు వచ్చి తనకు ఆజ్ఞాపించిన వాటిని ఇశ్రాయేలీయులకు చెప్పేవాడు.

  7. అప్పుడు అతని ముఖం ప్రకాశించడం ఇశ్రాయేలీయులు చూశారు; మోషే తిరిగి యెహోవాతో మాట్లాడడానికి వెళ్లేవరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.

  8. కాబట్టి రాజు, “నీవు అనారోగ్యంగా లేవు కదా, మరి నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? ఇది హృదయంలో ఉన్న విచారమే తప్ప మరొకటి కాదు” అని అన్నారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను, కాని

  9. నేను రాజుతో, “రాజు చిరకాలం జీవించును గాక! నా పూర్వికులను పాతిపెట్టిన పట్టణం శిథిలావస్థలో ఉండి, దాని ద్వారాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు నా ముఖం ఎందుకు విచారంగా కనిపించకూడదు?” అన్నాను.

  10. రాజు తన బల్ల నుండి వారి కోసం ఆహారం, ద్రాక్షరసం కొంత భాగాన్ని ప్రతిరోజు వారికి కేటాయించాడు. వారు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది ఆ తర్వాత వారు రాజుకు సేవ చేయాలి.

  11. యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు.