Candidate గురించి బైబిల్ వచనాలు: Electioneering by, instance of, Absalom
Electioneering by, instance of, Absalom గురించి వచనాలు
కొంతకాలం తర్వాత అబ్షాలోము ఒక రథాన్ని, గుర్రాలను తన ముందు పరుగెత్తడానికి యాభైమంది పురుషులను అంగరక్షకులుగా సమకూర్చుకున్నాడు.
అతడు ఉదయాన్నే లేచి పట్టణ ద్వారానికి వెళ్లే దారి ప్రక్కన నిలబడేవాడు. రాజు తీర్పు పొందడానికి ఎవరైనా ఫిర్యాదులతో వస్తే అబ్షాలోము వారిని పిలిచి, “మీది ఏ ఊరు?” అని అడిగేవాడు. “నీ సేవకుడైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలాన దానికి చెందిన వాడినని” ఆ వ్యక్తి చెప్పినప్పుడు,
అప్పుడు అబ్షాలోము, “చూడు, నీ ఫిర్యాదులు విలువైనవి, సరియైనవే కాని, వాటిని వినడానికి రాజు ప్రతినిధులెవరు లేరు” అని అనేవాడు.
ఇంకా అబ్షాలోము, “నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా నియమించబడి ఉంటే బాగుండేది! అప్పుడు ఎవరైనా ఫిర్యాదులతో వివాదాలతో నా దగ్గరకు వస్తే, వారికి న్యాయం జరిగేలా చూసేవాన్ని” అని చెప్పేవాడు.
అలాగే, ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు అబ్షాలోము తన చేయి చాచి, అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు.
తీర్పు కోసం రాజు దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయులందరితో అబ్షాలోము ఇలానే మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.