Beriah గురించి బైబిల్ వచనాలు: 2. Son of Ephraim
2. Son of Ephraim గురించి వచనాలు
ఎఫ్రాయిం వారసులు: ఎఫ్రాయిం కుమారుడు షూతలహు, అతని కుమారుడు బెరెదు, అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఎల్యాదా, అతని కుమారుడు తాహతు,
అతని కుమారుడు జాబాదు, అతని కుమారుడు షూతలహు. (అతని కుమారులైన ఏజెరు ఎల్యాదులు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకోడానికి వెళ్లినప్పుడు, గాతీయులు వారిని చంపారు.
వారి తండ్రియైన ఎఫ్రాయిం చాలా రోజులు దుఃఖపడ్డాడు, అతని బంధువులు వచ్చి అతన్ని ఓదార్చారు.
ఆ తర్వాత అతడు తన భార్యను కలుసుకోగా ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. తన కుటుంబంలో జరిగిన కీడును బట్టి ఎఫ్రాయిం అతనికి బెరీయా అనే పేరు పెట్టాడు.