Skip to content

Backsliders గురించి బైబిల్ వచనాలు: General references

196 వచనాలు · 1 కోణం

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘కానీ మీరు నా మాట వినకపోతే, ఈ ఆజ్ఞలన్నిటిని పాటించకపోతే,

  2. మీరు నా శాసనాలను తిరస్కరించి, నా చట్టాలను అసహ్యించుకుని నా ఆజ్ఞలన్నిటిని పాటించడంలో విఫలమై, నా నిబంధనను ఉల్లంఘిస్తే,

  3. అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.

  4. నేను మీకు విరోధంగా నా ముఖం పెడతాను, తద్వార మీ శత్రువులతో ఓడిపోతారు; మిమ్మల్ని ద్వేషించేవారే మిమ్మల్ని పరిపాలిస్తారు, ఎవరూ తరమకుండానే మీరు పారిపోతారు.

  5. “ ‘ఇదంతటి తర్వాత మీరు నా మాట వినకపోతే, నేను మీ పాపాల కోసం మిమ్మల్ని ఏడు రెట్లు ఎక్కువగా శిక్షిస్తాను.

  6. నేను మీ మొండి అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి, మీ పైన ఉన్న ఆకాశాన్ని ఇనుములా, మీ క్రింద ఉన్న భూమిని ఇత్తడిలా చేస్తాను.

  7. మీ బలము వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీ నేల తన పంటలను ఇవ్వదు, పండదు. మీ భూమిలో ఉన్న చెట్లు ఫలం ఇవ్వవు.

  8. “ ‘మీరు నా పట్ల శత్రుత్వం కలిగి ఉంటే, నా మాట వినడానికి నిరాకరిస్తే, మీ పాపాలకు తగినంతగా నేను మీ బాధలను ఏడు రెట్లు పెంచుతాను.

  9. మీకు విరుద్ధంగా అడవి జంతువులు పంపుతాను, అవి మీ నుండి మీ పిల్లలను దోచుకుంటాయి, మీ పశువులను నాశనం చేస్తాయి, మీ మార్గాలన్నీ నిర్మానుష్యమయేలా మీ సంఖ్య తగ్గేలా చేస్తాయి.

  10. “ ‘ఇవన్నీ జరిగినా కూడా నా దిద్దుబాటును అంగీకరించకుండా నాకు విరుద్ధంగా ఉండడం కొనసాగిస్తే,

  11. నేనే మీ పట్ల శత్రువుగా ఉంటాను, మీ పాపాలకు ఇంకా ఏడు రెట్లు బాధిస్తాను.

  12. నిబంధన ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీపై ఖడ్గం తెస్తాను. మీరు మీ పట్టణాల్లోకి వెళ్లినప్పుడు, నేను మీ మధ్యకు తెగులును పంపుతాను, మీరు శత్రువు చేతుల్లోకి ఇవ్వబడతారు.

  13. నేను మీ రొట్టె సరఫరాను నిలిపివేసినప్పుడు, పదిమంది స్త్రీలు మీ రొట్టెను ఒక పొయ్యిలో కాల్చగలుగుతారు, వారు తూనికె చొప్పున రొట్టెను కొలిచి ఇస్తారు. మీరు తింటారు, కానీ మీరు సంతృప్తి చెందరు.

  14. “ ‘ఇవన్నీ జరిగినా కూడా మీరు నా మాట వినకుండా ఇంకా నాకు విరుద్ధంగా ఉంటే,

  15. అప్పుడు నా కోపంలో నేను మీ పట్ల శత్రుత్వం కలిగి ఉంటాను, నేనే మిమ్మల్ని మీ పాపాల కోసం ఇంకా ఏడు రెట్లు శిక్షిస్తాను.

  16. మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు.

  17. నేను మీ క్షేత్రాలను నిర్మూలం చేస్తాను, మీ ధూప బలిపీఠాలను పడగొట్టి, మీ మృతదేహాలను ప్రాణం లేని మీ విగ్రహాల రూపాలపై పోగుచేస్తాను, నేను మిమ్మల్ని అసహ్యించుకుంటాను.

  18. నేను మీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను, మీ పరిశుద్ధాలయాలను వృథా చేస్తాను, మీ అర్పణల సువాసన యందు నేను ఆనందించను.

  19. నేను భూమిని వృధా చేస్తాను, తద్వార అక్కడ నివసించే మీ శత్రువులు ఆశ్చర్యపడతారు.

  20. నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టి, నా ఖడ్గాన్ని తీసి మిమ్మల్ని వెంటాడుతాను. మీ భూమి వృథా అవుతుంది, మీ పట్టణాలు శిథిలావస్థలో ఉంటాయి.

  21. మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు భూమి తన సబ్బాతు సంవత్సరాలను ఆనందిస్తుంది తద్వార ఎప్పటికీ అది నిర్జనమై ఉంటుంది; అప్పుడు భూమి విశ్రాంతి తీసుకుని దాని సబ్బాతు దినాలను ఆనందిస్తుంది.

  22. అన్ని సమయాల్లో అది నిర్జనమై ఉంటుంది, మీరు అందులో నివసించినప్పుడు సబ్బాతు దినాల్లో అది పొందని విశ్రాంతిని పొందుతుంది.

  23. “ ‘మీలో మిగిలిన వారికైతే, వారి శత్రువుల దేశాల్లో గాలికి ఆకులు అల్లాడితే పారిపోవునంతగా వారి హృదయాలు ఎంతో భయపడేలా చేస్తాను. ఖడ్గం నుండి వారు పారిపోతున్నట్టు వారు పరుగెత్తుతారు, ఎవరు తరమకుండానే వారు పడిపోతారు,

  24. ఎవరూ వారిని తరమనప్పట్టికి ఖడ్గం నుండి పారిపోతున్నట్లు వారు ఒకరిపై ఒకరు దొర్లుతారు. కాబట్టి మీరు మీ శత్రువుల ఎదుట నిలువలేరు.

  25. మీరు దేశాల మధ్య నశిస్తారు; మీ శత్రువుల భూమి మిమ్మల్ని మ్రింగివేస్తుంది.