Skip to content

Atheism గురించి బైబిల్ వచనాలు

21 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి, ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.

  2. భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది, సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.

  3. వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని తెలుసుకోలేనివారు ఎవరు?

  4. ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం మానవులందరి ఊపిరి ఉంది.

  5. నాలుక ఆహారం రుచిని చూసినట్లు చెవి మాటలను పరిశీలించదా?

  6. వృద్ధుల దగ్గర జ్ఞానం దొరకదా? దీర్ఘాయువు గ్రహింపును తీసుకురాదా?

  7. జ్ఞానం శక్తి దేవునికి చెందినవి; ఆలోచన గ్రహింపు ఆయనవే.

  8. దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కట్టలేరు; ఆయన బంధించిన వారిని ఎవరూ విడిపించలేరు.

  9. ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి; ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి.

  10. బలం వివేకం ఆయనకు చెందినవే; మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే.

  11. ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు, న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు.

  12. ఆయన రాజులు వేసిన సంకెళ్ళు తీసివేస్తారు వారి నడుము చుట్టూ తాడు కడతాడు.

  13. యాజకులను దిగంబరులుగా చేసి నడిపిస్తారు, స్థిరంగా పాతుకుపోయిన అధికారులను పడగొడతారు.

  14. నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు, పెద్దల వివేచనను తీసివేస్తారు.

  15. ఆయన అధిపతుల మీద అవమానాన్ని కురిపిస్తారు, బలవంతులను నిరాయుధులనుగా చేస్తారు.

  16. ఆయన చీకటిలోని లోతైన విషయాలను వెల్లడిస్తారు చిమ్మ చీకటిని వెలుగులోకి తెస్తారు.

  17. ఆయన దేశాలను గొప్ప చేస్తారు వాటిని నాశనం చేస్తారు; దేశాలను విశాలపరుస్తారు వాటిని చెదరగొడతారు.

  18. ఆయన భూలోక నాయకుల గ్రహింపును తీసివేస్తారు; వారు దారిలేని ఎడారిలో తిరుగులాడేలా చేస్తారు.

  19. వారు వెలుగు లేదా చీకటిలో తడబడతారు; ఆయన వారిని త్రాగుబోతు తూలినట్లు తూలేలా చేస్తారు.

  20. దేవుడే వారికి తెలియజేశారు కాబట్టి దేవుని గురించి తెలుసుకోవలసిన సంగతులు వారికి స్పష్టంగా ఉన్నాయి.

  21. లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా దేవుని అదృశ్యలక్షణాలైన శాశ్వతమైన శక్తి దైవిక స్వభావం స్పష్టంగా కనిపించాయి. కాబట్టి దేవున్ని తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు.