కంటెంట్‌కు వెళ్లండి

Astronomy గురించి బైబిల్ వచనాలు: General references

17 వచనాలు · 2 కోణాలు

"Astronomy" కోసం వెతకండి

General references గురించి వచనాలు

  1. “కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో బంధించగలవా? మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా?

  2. నక్షత్ర రాశులను వాటి వాటి కాలాల్లో వచ్చేలా నీవు చేయగలవా? సప్తరుషి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా?

  3. ఆకాశం యొక్క చట్టాలు నీకు తెలుసా? నీవు భూమిపై దేవుని ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయగలవా?

  4. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి; అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది.

  5. పగటికి పగలు బోధ చేస్తుంది; రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.

  6. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు; వాటి స్వరం వినబడదు.

  7. అయినా వాటి స్వరం భూమి అంతటికి, వాటి మాటలు భూదిగంతాలకు వెళ్తాయి. దేవుడు ఆకాశంలో సూర్యునికి డేరా వేశారు.

  8. సూర్యుడు తన మంటపంలో నుండి బయటకు వస్తున్న పెండ్లికుమారునిలా, తన పందెం పరుగెత్తడంలో ఆనందిస్తున్న వీరునిలా వస్తున్నాడు.

  9. ఆకాశంలో ఒక చివర ఉదయించి మరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.

  10. ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  11. నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  12. మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  13. పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  14. రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  15. యెహోవా ఇలా చెప్తున్నారు, పగలు ప్రకాశించడానికి సూర్యుని నియమించినవాడు, రాత్రి ప్రకాశించడానికి, చంద్రుని, నక్షత్రాలను శాసించేవాడు, కెరటాలు గర్జించేలా, సముద్రాన్ని కదిలించేవాడు ఆయనే, ఆయన పేరు సైన్యాల యెహోవా:

  16. “ఈ శాసనాలు నా దృష్టి నుండి మాయమైతేనే,” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇశ్రాయేలు ఇక ఎన్నటికీ నా ఎదుట ఒక జనంగా ఉండదు.”

  17. యెహోవా ఇలా అంటున్నారు: “పైన ఉన్న ఆకాశాలు కొలవబడగలిగితే, అలాగే క్రింద ఉన్న భూమి పునాదులు పరిశోధించబడగలిగితే తప్ప, వారు చేసినదంతటిని బట్టి నేను ఇశ్రాయేలు సంతతివారందరిని తిరస్కరిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.