Abia గురించి బైబిల్ వచనాలు: 2. Son of Samuel
2. Son of Samuel గురించి వచనాలు
సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు.
అతని మొదటి కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా; వారు బెయేర్షేబలో న్యాయాధిపతులుగా ఉన్నారు.
అయితే అతని కుమారులు అతని మార్గాన్ని అనుసరించలేదు. వారు అక్రమ సంపాదన కోసం లంచాలు తీసుకుని న్యాయాన్ని తారుమరు చేసేవారు.
కాబట్టి ఇశ్రాయేలీయుల పెద్దలందరు ఒక్కటిగా కలిసి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారు.
వారతనితో, “నీవు ముసలివాడవు, నీ కుమారులు నీ మార్గాన్ని అనుసరించుట లేదు; కాబట్టి ఇతర దేశాలకు రాజు ఉన్నట్లే మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని అడిగారు.
సమూయేలు కుమారులు: మొదటివాడు యోవేలు రెండవవాడు అబీయా.