Skip to content
జెఫన్యా 3:8

జెఫన్యా 3:8

చుట్టుపక్కల సందర్భంతో వచనం 8 చూపబడుతోంది.
5
అయితే యెహోవా నీతిమంతుడు; ఆయన తప్పు చేయరు. అనుదినం ఆయన మానకుండా, ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు, అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు.
6
“నేను దేశాలను నాశనం చేశాను; వాటి కోటలు పడగొట్టబడ్డాయి. నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను, ఎవరూ వాటి గుండా వెళ్లరు. వాటిలో ఎవరూ నివసించకుండా వారి పట్టణాలను నిర్జనంగా చేశాను.
7
నేను యెరూషలేము గురించి, ‘ఖచ్చితంగా నీవు నాకు భయపడి దిద్దుబాటును అంగీకరిస్తావు! అప్పుడు దాని ఆశ్రయ స్థలం నాశనం చేయబడదు, నా శిక్షలేవీ దాని మీదికి రావు’ అని అనుకున్నాను. కాని వారు అన్ని రకాల చెడుపనులు చేయాలని ఆతృతగా ఉన్నారు.
8
కాబట్టి నా కోసం వేచి ఉండండి,” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడే రోజు కోసం వేచి ఉండండి. నేను దేశాలను పోగుచేయాలని, రాజ్యాలను సమకూర్చాలని వాటి మీద నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని కుమ్మరించాలని నిర్ణయించుకున్నాను. రోషంతో కూడిన నా కోపానికి లోకమంతా దహించబడుతుంది.
9
“నేను ప్రజల పెదవులను శుద్ధి చేస్తాను, అప్పుడు వారంతా యెహోవా నామానికి మొరపెట్టి ఏక మనసుతో ఆయనను సేవిస్తారు.
10
చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలు కూషు నదుల అవతల నుండి నాకు అర్పణలు తెస్తారు.
11
ఆ దినాన యెరూషలేమా, నీవు నా మీద తిరుగబడి చేసిన పనుల గురించి నీవు సిగ్గుపడవు, ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారిని నేను నీలో నుండి తొలగిస్తాను. నా పరిశుద్ధ కొండపై ఇంకెప్పుడు నీవు గర్వపడవు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options