కీర్తనలు 83:9-18
9
మిద్యానుకు చేసినట్లుగా, కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి.
10
వారు ఎన్-దోరు దగ్గర నశించారు నేల మీద పేడలా అయ్యారు.
11
ఓరేబుకు జెయేబుకు చేసినట్లు వారి సంస్థానాధిపతులకు జెబహుకు సల్మున్నాకు వారి యువరాజులందరికి చేయండి.
12
వారు, “దేవుని పచ్చికబయళ్లను స్వాధీనం చేసుకుందాం” అని అన్నారు.
13
నా దేవా, వారిని సుడి తిరిగే దుమ్ములా, గాలి ముందు కొట్టుకుపోయే పొట్టులా చేయండి.
14
అగ్ని అడవిని దహించునట్లు కారుచిచ్చు పర్వతాలను తగలబెట్టినట్లు,
15
మీ తుఫానుతో వారిని వెంటాడండి మీ సుడిగాలితో వారిని భయపెట్టండి.
16
వారు మీ నామాన్ని వెదకునట్లుగా, యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి.
17
వారు ఎప్పటికీ సిగ్గుపడాలి భయపడాలి; వారు అవమానంలో నశించెదరు గాక.
18
యెహోవా అనే నామం గల మీరు భూమి మీద అందరిలో మహోన్నతుడవని వారు తెలుసుకోవాలి.
Settings