Skip to content
కీర్తనలు 44:17-26

కీర్తనలు 44:17-26

17
ఇదంతా మా మీదికి వచ్చిపడినా, మేము మిమ్మల్ని మరవలేదు; మీ నిబంధన విషయం నమ్మకద్రోహులం కాలేదు.
18
మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు.
19
నక్కలు తిరిగే చోట మీరు మమ్మల్ని నలగ్గొట్టి పడేశారు; చావు నీడ మమ్మల్ని ఆవరించి ఉన్నది.
20
ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా, పరదేశి దేవుని వైపు చేతులు చాపినా,
21
హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా?
22
అయినా రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.
23
ప్రభువా, లెండి! ఎందుకీ నిద్ర? లెండి మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టకండి.
24
మీ ముఖాన్ని మా నుండి ఎందుకు దాచుకుంటున్నారు? నా బాధను నా హింసను మరచిపోయారా?
25
మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము; మా దేహాలు నేలకు అంటుకుపోయాయి.
26
లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options